Monday, October 26, 2026
More
    HomeUncategorizedతుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం..! ‘అర్నబ్’గా నామకరణం.. బాపట్ల–విశాఖ మధ్య...

    తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం..! ‘అర్నబ్’గా నామకరణం.. బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం..!

    📰 Generate e-Paper Clip

    తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం..!

     

    ‘అర్నబ్’గా నామకరణం.. బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం..!

     

    విశాఖపట్నం:

     

    బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి ‘అర్నబ్’గా నామకరణం చేశారు.

     

    గడిచిన ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలినట్లు APSDMA సమాచారం పేర్కొంది.

     

    ప్రస్తుతానికి విశాఖపట్నానికి 650 కిలోమీటర్లు, కాకినాడకు 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 830 కిలోమీటర్లు, బాపట్లకు 910 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు సమాచారం.

     

    ఈరోజు అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, రేపు అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనా.

     

    ఎల్లుండి ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.

    *ఏపీలో తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్*

     

    ఏపీలో తుపాను దృష్ట్యా ఈనెల 27న ఏపీలోని కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

     

    శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కడప, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు.

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!