Wednesday, October 28, 2026
More
    HomeUncategorized216 జాతీయ రహదారిపై భారీ చెట్లు కూలి.. ట్రాఫిక్‌కు అంతరాయం! ఎస్సై రవీంద్రబాబు చొరవతో యుద్ధప్రాతిపదికన...

    216 జాతీయ రహదారిపై భారీ చెట్లు కూలి.. ట్రాఫిక్‌కు అంతరాయం! ఎస్సై రవీంద్రబాబు చొరవతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు.. వాహన రాకపోకలు పునరుద్ధరణ

    📰 Generate e-Paper Clip

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా – ముమ్మిడివరం నియోజకవర్గం

    ఐ. పోలవరం, అక్టోబర్ 28: ఐ. పోలవరం మండల పరిధిలోని 216వ జాతీయ రహదారిపై భారీ చెట్లు కూలిపోవడంతో సుమారు కిలోమీటరు మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రహదారిపై చెట్లు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    ఎస్సై రవీంద్రబాబు తక్షణ స్పందన

    సమాచారం అందుకున్న ఐ. పోలవరం ఎస్సై రవీంద్రబాబు వెంటనే స్పందించి పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి, రహదారిపై పడిన భారీ చెట్లను తొలగించేందుకు జేసీబీ, కట్టర్ మిషన్ల సహాయంతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

    ట్రాఫిక్ క్లియర్.. వాహనదారులకు ఊరట

    పోలీసుల సమన్వయంతో రహదారిపై ఉన్న చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో వాహనదారులకు ఊరట లభించింది.

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!