Saturday, November 7, 2026
More
    HomeUncategorized*సేవా నిరతికి నిదర్శనం: పతకాల పంట పండించిన ఇంద్రపాలెం చిన్నారులు!* *నిస్వార్థ కరాటే మాస్టర్...

    *సేవా నిరతికి నిదర్శనం: పతకాల పంట పండించిన ఇంద్రపాలెం చిన్నారులు!* *నిస్వార్థ కరాటే మాస్టర్ మహమ్మద్ హాజీకి స్థానికుల ప్రశంసల జల్లు* *ఖమ్మం పోటీల్లో 10 బంగారు, 10 వెండి పతకాలతో అదరగొట్టిన విద్యార్థులు

    📰 Generate e-Paper Clip

    ​కాకినాడ సిటీ నవంబర్ 7 జి ఎస్ బి వార్త

    ఆర్థిక స్తోమత లేనిదే విద్య అబ్బని నేటి రోజుల్లో, రూపాయి ఆశించకుండా గ్రామీణ ప్రాంత నిరుపేద చిన్నారులకు ఆత్మరక్షణ విద్యను నేర్పిస్తూ భావి ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతున్న కరాటే మాస్టర్ మహమ్మద్ హాజీ సమాజానికే ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఇంద్రపాలెంలో కుల, మత, వర్గ విభేదాలు లేకుండా, చిన్నారుల భవిష్యత్తే ధ్యేయంగా ఆయన అందిస్తున్న ఉచిత కరాటే శిక్షణ నేడు అద్భుత ఫలితాలను ఇస్తోంది. హాజీ నిస్వార్థ సేవలకు ఫలితంగా గ్రామీణ చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయదుందుభి మోగిస్తున్నారు.ఇటీవల ఖమ్మంలో జల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమన్ షోటోకాన్ అకాడమీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన టోర్నమెంట్‌లో ఇంద్రపాలెం చిన్నారులు తమ అసమాన ప్రతిభతో ఔరా అనిపించారు. ఈ పోటీల్లో పాల్గొన్న 20 మంది విద్యార్థులూ ఒక్కరూ తగ్గకుండా 10 స్వర్ణ పతకాలు, 10 రజత పతకాలు కైవసం చేసుకుని పోటీదారులను విస్మయానికి గురిచేశారు. బరిలోకి దిగిన ప్రతి ఒక్కరూ పతకం సాధించి శభాష్ అనిపించుకున్నారు. విజేతలకు నిర్వాహకులు మెడల్స్, సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు.
    ​గతంలోనూ హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో ఏకంగా 25 బంగారు, 5 వెండి పతకాలు సాధించడమే కాకుండా, జీడిమెట్లలో ఐదుగురు విద్యార్థులు ఏకంగా “గిన్నిస్ వరల్డ్ రికార్డు” సాధించి చరిత్ర సృష్టించడం మాస్టర్ హాజీ అంకితభావానికి, కఠోర శిక్షణకు నిలువెత్తు నిదర్శనం.
    ​నేటి సమాజంలో ప్రతి ఆడపిల్లకూ ఆత్మరక్షణ విద్య రక్షణ కవచం లాంటిదని, తల్లిదండ్రులు చిన్నారులను క్రీడల్లో మరింత ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన మాస్టర్ హాజీ దృక్పథాన్ని పలువురు కొనియాడుతున్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ, గ్రామానికి గర్వకారణంగా నిలిచిన మహమ్మద్ హాజీని, పతకాలతో మెరిసిన విద్యార్థులను స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు వేనోళ్ల పొగుడుతూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!