ఘనంగా పెద్దన్నయ్య శ్రీనురాజు 55వ జన్మదిన వేడుకలు అల్లూరివారి చెరువు పేటలో అభిమానుల సందడి గుత్తాల రాము ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహణ

    Date:

    📰 Generate e-Paper Clip


    ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): ప్రజలతో మమేకమై, అందరికీ ఆప్తుడిగా, అభిమానులకు పెద్దన్నయ్యగా పేరుగాంచిన వైఎస్సార్ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు) 55వ జన్మదిన వేడుకలు అల్లూరివారి చెరువు పేటలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

    వైఎస్సార్ నాయకుడు గుత్తాల రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వైఎస్సార్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. అభిమాన నాయకుడు శ్రీనురాజు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు శ్రీనురాజుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అందరి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచే నాయకుడిగా శ్రీనురాజు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.

    అభిమానులు, కార్యకర్తల కోలాహలం మధ్య జరిగిన ఈ జన్మదిన వేడుకలు అల్లూరివారి చెరువు పేటలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. శ్రీనురాజుకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని పలువురు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

     

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!