మత్స్యకార కుటుంబాలకు వంగ గీత ఆహార పొట్లాల పంపిణీ
యు కొత్తపల్లి అక్టోబర్ 28(జి ఎస్ బి వార్త) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన ఆర్నబ్ తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు వైఎస్సార్‌సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ అండగా నిలిచారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ, కొనపాపపేట తదితర తీర ప్రాంతాల్లో బుధవారం పర్యటించిన ఆమె తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యల్లో భాగస్వాములయ్యారు. తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారులకు భోజనం, అల్పాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. తుఫాను నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
