ఐ. పోలవరం నవంబర్ 05( జీఎస్ బి వార్త ) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఐ. పోలవరం మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని వివిధ పార్టీల జెడ్పీటీసీ అభ్యర్థులు పరిశీలించారు.
తెలుగుదేశం పార్టీ కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి బీర సత్యకుమారి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సకిలే పద్మావతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ నిర్వహణ, ఓటర్ల రాకపోకలు, ఎన్నికల ఏర్పాట్లను గమనించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సాగిరాజు సూరిబాబు రాజు, విత్తనాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జీఎస్బీ వార్త రిపోర్టర్: వేణు కాశి


