జగన్నాదగిరిలో దూసుకుపోతున్న సైకిల్ స్పీడ్ ఇంటింటా ప్రచారంలో సత్తిబాబు కి విశేష ప్రజా స్పందన
కాజులూరు (జి ఎస్ బి వార్త) నవంబర్ 3
కాజులూరు మండలం జగన్నాదగిరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వనుo సత్యనారాయణ (సత్తిబాబు ) కిఎన్నికల ప్రచారంలో విశేష ప్రజాస్పందన లభించింది . గ్రామంలోఇంటింటి ప్రచారం లో భాగంగా జోరుగా వర్షం కురుస్తున్న ప్రజలు బ్రహ్మరథం పట్టారు సైకిల్ గుర్తుపై ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు గ్రామంలో ఆయనకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం సత్తిబాబు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంపీటీసీ నిధులతో గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ,
