కాట్రేనికోన, అక్టోబర్ 4 (జీఎస్‌బీ వార్త):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో జనసేన పార్టీలో ఇటీవల చేరిన కుడిపూడి శివన్నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆక్వా రైతు సంఘం కార్యదర్శి, జనసేన మద్దతుదారు త్సవటపల్లి నాగభూషణంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.
అనంతరం చెయ్యేరు గ్రామానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలతో కుడిపూడి శివన్నారాయణ ఆత్మీయంగా సమావేశమయ్యారు. పార్టీ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. జనసేన సిద్ధాంతాలు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని కుడిపూడి శివన్నారాయణ తెలిపారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అందరి సహకారంతో ముందుకు సాగుతానన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు నంద్యాల శివాజీ, మాజీ ఉప సర్పంచ్ త్సవటపల్లి నారాయణస్వామి, బొక్క జై రమేష్, మండల ఉపాధ్యక్షులు కాయల బలరాం, త్సవటపల్లి మణికుమార్, అడపా సాయి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ పోలిశెట్టి వెంకట్ రాజు, నంద్యాల బ్రహ్మాజీ, రావికుల బూసి, త్సవటపల్లి పార్థసారథి, పోతంశెట్టి శ్రీను, త్సవటపల్లి హేమంత్, అక్కల బాలకృష్ణ, పోలిశెట్టి నాని, చాగంటి వాసు తదితరులు పాల్గొన్నారు.
కుడిపూడి శివన్నారాయణ జనసేనలో చేరడం పట్ల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చెయ్యేరు గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యలపై పనిచేయాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.


