డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా – ముమ్మిడివరం నియోజకవర్గం:
ఐ. పోలవరం మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సకిలే పద్మావతి తరఫున ఆమె భర్త సకిలే వెంకటేశ్వరరావు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
వర్షం కురుస్తున్నప్పటికీ వెనుకడుగు వేయకుండా మండలంలోని వివిధ గ్రామాల్లో ఓటర్లను నేరుగా కలుస్తూ, వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా సకిలే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఐ. పోలవరం మండల అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి సకిలే పద్మావతిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షంలోనూ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఓటర్లను కలుస్తుండటం ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా కనిపిస్తోంది.
జీఎస్బీ వార్త రిపోర్టర్: వేణు కాశి


