ఐ . పోలవరం మురమళ్ల, అక్టోబర్ 8 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): ముమ్మిడివరం నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు దివి వెంకట తేజను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) అభినందించారు.
మురమళ్లలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దివి వెంకట తేజ మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ వార్ రూమ్–మైటీడీపీ యాప్ యాక్టివేషన్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నందుకు తనకు అందిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ను ఎమ్మెల్యేకు చూపించారు.
పార్టీ డిజిటల్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, మైటీడీపీ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలను అనుసంధానం చేయడం, పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిని వెంకట తేజ వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వెంకట తేజను అభినందించారు. పార్టీ కార్యక్రమాల్లో ఇదే స్ఫూర్తితో మరింత చురుకుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

