టీ.కొత్తపల్లి, అక్టోబర్ 7 (జీఎస్‌బీ వార్త): కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో టీ.కొత్తపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS) డా. కార్తిక్ బుధవారం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
నర్సింగ్, ల్యాబొరేటరీ, రేడియాలజీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఫార్మసీ, కేస్ షీట్లు, వివిధ వైద్య విభాగాలను తనిఖీ చేశారు.
రోగులకు వైద్య సేవలు సకాలంలో అందేలా, ఆసుపత్రిలోని అన్ని సేవలు సజావుగా కొనసాగించేలా సిబ్బందికి పలు సూచనలు, మార్గదర్శకాలు అందించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. జ్యోతిర్మయి, డెంటల్ డాక్టర్ దినేష్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



